ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా సెయింట్ జాన్స్ పాఠశాల

ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా సెయింట్  జాన్స్  పాఠశాల ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా సెయింట్ జాన్స్ పాఠశాల

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా సెయింట్  జాన్స్  పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనా వైరస్ తో వివిధ దేశాలు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం జనావాసాలు కలిగిన పాఠశాలలు సినిమాలు మాల్స్ రద్దీ ప్రాంతాలను సెలవులు  గా  ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, అయినా బొల్లారం మున్సిపల్ పరిధిలోని సెయింట్ జాన్స్ పాఠశాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ ఆదేశాలను ధిక్క రించి వార్షికోత్సవం నిర్వహించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది బొల్లారంలోని  సుమారు 10 పాఠశాలలు ఉండగా ఇలాంటి పరిస్థితుల్లో సెయింట్ జాన్స్  పాఠశాల యాజమాన్యం వార్షికోత్సవం ఎలా నిర్వహిస్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఎలాంటి మాస్కులు లేకుండా సంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించడం అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది ఒకవేళ ఎవరికైనా కరోనా వైరస్ ఉండి ఉంటే అది మరొకరికి వ్యాప్తి  చెందుతుంది పాఠశాల యాజమాన్యం కనీస అవగాహన లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి,  ఎప్పటికైనా జిల్లా  విద్యా శాఖ అధికారులు మొద్దు నిద్ర విడి స్పందించి ఇలాంటి పాఠశాలలపై ఎలాంటి  కఠినమైన చర్యలు  తీసుకుంటారో  వేచి  చూడాలి  మరి