శిల్పరామం అండర్ పాస్ దగ్గర ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ను జీహెఎంసి మేయర్ బొంతు

శిల్పరామం అండర్ పాస్ దగ్గర ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ను జీహెఎంసి మేయర్ బొంతు శిల్పరామం అండర్ పాస్ దగ్గర ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ను జీహెఎంసి మేయర్ బొంతు

శేరిలింగంపల్లి : కొండాపూర్ : శిల్పరామం అండర్ పాస్ దగ్గర ప్లాస్టిక్ రహిత గ్రీన్ ఫుడ్ జోన్ ను జీహెఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ గారు, ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అరికెపూడి గాంధీ గారు, జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్  గౌడ్ గారు,  శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్ గారు కలసి ప్రారంభిచారు. 

మేయర్ బొంతు రామ్మోహన్ గారు,  శాసన సభ్యులు అరికెపూడి గాంధీ గారు, కార్పొరేటర్లు హమీద్ పటేల్ గారు, జగదీశ్వర్ గౌడ్ గారు  మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా  అభివృద్ధి చేస్తామన్నారు.కేటీఆర్ పిలుపు మేరకు పాదచారులకు, రుచికరమైన, ఆరోగ్యమైన ఆహారాన్ని అందించటమే లక్ష్యం గా ఈ స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ జోన్ ఏర్పాటు చెయ్యటం జరిగిందన్నారు. 50 స్టాల్ల్స్ తో ఇక్కడ ప్లాస్టిక్ రహితగ్రీన్ జోన్ ఏర్పాటు చెయ్యటం జరిగిందన్నారు. అందరికి అందుబాటులో ధరలలో రుచికరమైన, శుచి శుభ్రత కల్గిన ఆహారాన్ని అదించాలన్న లక్ష్యంతో ఈ యొక్క ప్లాస్టిక్ రహిత గ్రీన్ స్ట్రీట్ వెండర్స్ జోన్ ఏర్పాటు చెయ్యటం జరిగిందన్నారు.