పట్టణ ప్రగతి

పట్టణ ప్రగతి పట్టణ ప్రగతి

పట్టణాల రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణములోని 10,11వ వార్డులో ఎమ్మెల్యే అరూరి రమేష్ తో కలిసి వాడ వాడ కలియతిరుగుతూ పారిశుధ్యం. డ్రైనేజీ లను పరిశీలించారు మంత్రి దయాకర్ రావు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా  డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టి వాటి పరిష్కరించలని  అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.ముఖ్యంగా డివిజన్లలో వార్డుల వారీగా పారుశుద్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, అంతర్గత రోడ్ల మరమ్మత్తు, మురుగు కాలువలను శుభ్రం చేయడం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. దీని కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణ ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు క్రుషి చేయాలని పేర్కోన్నారు.కొత్తగా ఏర్పాటైన వర్ధన్నపేట మున్సిపాలిటీలో రెండు కోట్ల రూపాయలతో ఆధునిక హంగులతో మార్కెట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఎవరైనా పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు