పాపం, రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానంటే వద్దని కెరీర్ నాశనం చేసుకున్న అర్

పాపం, రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానంటే వద్దని కెరీర్ నాశనం చేసుకున్న అర్ పాపం, రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానంటే వద్దని కెరీర్ నాశనం చేసుకున్న అర్

ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం లభించదు. అతను సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికినా ఎగిరి గంతేసే నటి నటులు ఎందరో ఉన్నారు. మరి అంత గొప్ప దర్శకుడు రాజమౌళి... తన సినిమాలో హీరోయిన్ గా నటించమని ఒక నటిని అడిగితే ఆమె నక్కతోక తొక్కినట్టే. కానీ ఆ విషయం అర్థం కాక కొంచెం పొగరుతో అందివచ్చిన అవకాశాన్ని కాళ్ల దన్నుకొని ఇప్పుడు చాలా పశ్చాతాప పడుతున్నాను అంటుంది అర్చన శాస్త్రి.

తాజాగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అర్చన శాస్త్రి మాట్లాడుతూ... నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాలో త్రిష కి స్నేహితురాలిగా నటించి మాంచి ఫామ్ లో ఉన్నానని కానీ ఆ తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ లలో నటించినా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని చెప్పుకొచ్చింది. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమా హిట్ అయిన తర్వాత రాజమౌళి తనని సంప్రదించి మర్యాద రామన్న సినిమా లో సలోని పాత్రని పోషించామని అడిగారని కానీ తను ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసానని, ఒకవేళ ఒప్పుకుంటే తన కెరియర్ మరోలా ఉండేదని తెగ ఫీల్ అయిపోతుంది అర్చన.

కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ రాజమౌళి సినిమా యమదొంగ లోని ఓ పాటకి డాన్స్ వేశానని, అప్పుడు రాజమౌళి కి క్షమాపణలు చెప్తామనుకున్నానని కానీ చెప్పలేకపోయానని అర్చన బాధపడుతూ చెప్పింది. ఇకపోతే అర్చన కెరియర్ పూర్తిగా నాశనం అయిపోగా... రాజమౌళి మాత్రం వరుస భారీ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా ఐదారు నెలల లోపు ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఏదేమైనా అందం అభినయం ఉన్న అర్చన శాస్త్రి కి స్టార్ నేమ్ రాకపోవడం బాధాకరమని చెప్పుకోవచ్చు.