లిప్ లాక్స్ మాకు ఓకే అంటున్న రష్మిక, పూజ...!

లిప్ లాక్స్ మాకు ఓకే అంటున్న రష్మిక, పూజ...! లిప్ లాక్స్ మాకు ఓకే అంటున్న రష్మిక, పూజ...!

లిప్ లాక్ అనేది బాలీవుడ్, హాలీవుడ్ సంస్కృతి, అక్కడ దర్శకులు, హీరోలు, నిర్మాతలు మాత్రమే ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు టాలీవుడ్ లో ఉన్న అభిప్రాయ౦ ఇది. మన పక్కన ఉన్న తమిళనాడు లో కూడా అక్కడి సినీ పరిశ్రమ లిప్ లాక్ విషయంలో కాస్త వెనకడుగు వేస్తూ ఉంటుంది అనేది వాస్తవం. అయితే ఇప్పుడు అభిప్రాయం మారింది. ఈ రెండు భాషల్లో కూడా జనాలు లిప్ లాక్ కోరుకుంటున్నారు. సినిమాలు కమర్షియల్ అవ్వాలి అంటే వసూళ్లు రావాలి అంటే కచ్చితంగా లిప్ లాక్ ఉండాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.


 

అందుకే నిర్మాతలు కూడా దర్శకులకు ఇవే సూచనలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఒక ఇద్దరు హీరోయిన్లు మీరు లిప్ లాక్ అడిగితే మేము రెడీ అంటున్నారు. వాళ్ళు ఇద్దరే రష్మిక మందనా పూజ హెగ్డే. ప్రస్తుత౦ ఈ ఇద్దరు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా ఉన్నారు. ఈ ఏడాది వీరికి మంచి ఆరంభం లభించింది. ఇక వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నారు ఈ ఇద్దరు. పారితోషికం విషయంలో కూడా కాస్త చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు ఈ ఇద్దరు. దీనితో దర్శకులు కూడా పెద్దగా ఇబ్బంది పడటం లేదనే చెప్పాలి.

ఇది పక్కన పెడితే వీళ్ళు కథ డిమాండ్ చేస్తే మేము లిప్ లాక్ ఇవ్వడానికి మేము సిద్దమని అంటున్నారు. ఏ హీరో అయినా మాకు పరవాలేదని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు చెరో మూడు సినిమాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది వరకు ఇద్దరు బిజీ గా ఉన్నారు. తమిళ సినిమాల్లో కూడా వీరికి అవకాశాలు వస్తున్నాయి. పారితోషికం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఇద్దరు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ ని ఈ ఇద్దరు ఏలుతున్నారు. మరో రెండు మూడేళ్ళు వీరికి ఇబ్బంది లేదని అంటున్నారు.