ప్రభాస్'కు వందకోట్లు.. తక్కువే !

ప్రభాస్'కు వందకోట్లు.. తక్కువే ! ప్రభాస్'కు వందకోట్లు.. తక్కువే !

'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా కోసం ప్రభాస్ ఎంత తీసుకుంటున్నాడు ? చర్చ సాగుతోంది. రూ. 70కోట్ల రెమ్యూనరేషన్, అదనపు ఛార్జీతలు అంతా కలిసి ప్రభాస్ కి రూ. 100కోట్లు ఇవ్వబోతున్నట్టు సమాచారమ్. అయితే, ఇది తక్కువే అంటున్నారు. ఎందుకంటే ?

ఈ సినిమా ఏడాది పాటు చిత్రీకరణ, ఆర్నెల్లు పోస్ట్ ఫ్రొడక్షన్ వుంటుందని అంచనా వేస్తున్నారు. సాహో లాంటి అంతగా అప్లాజ్ అందుకోని సినిమా కూడా బాలీవుడ్ లో మంచి ఫలితాలు నమోదు చేసింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఎప్పుడయితే యూనివర్సల్ అప్పీల్ వున్న సబ్జెక్ట్ తీసుకుని సినిమా చేస్తున్నారో కచ్చితంగా మంచి మార్కెట్ వుంటుంది. సినిమా బడ్జెట్ అన్నీ కలిపి 400 కోట్లు అని వినిపిస్తోంది. ఈ లెక్కన ప్రభాస్ కి వంద కోట్ల రెమ్యూనరేషన్ తక్కువేనని అంటున్నారు.

ఇక ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కలిసి ఓ వైవిధ్యమైన, అద్భుతమైన స్క్రిప్ట్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ తయారు చేసారు. ఇది చందమామ కథలాగా వుంటుంది. అదే టైమ్ లో సైన్స్ ఫిక్షన్ మాదిరిగా వుంటుంది. దాదాపు సినిమాలో మూడు వంతులకు పైగా గ్రీన్ మ్యాట్ లో చిత్రీకరించాల్సిందే. గ్రాఫిక్స్ తో సినిమాను తయారు చేయాల్సిందేనని చెబుతున్నారు