ఇది వర్కౌట్ కాదేమో ఆలోచించు!!

ఇది వర్కౌట్ కాదేమో ఆలోచించు!! ఇది వర్కౌట్ కాదేమో ఆలోచించు!!

రాజమౌళి RRR అప్ డేట్స్ కోసం హీరోల అభిమానులు వెర్రెత్తిపోయి ఉన్నారు. ఈ మార్చి లో RRR అంటూ ఊరిస్తున్నారు. అయితే అది హీరోల ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అంటూ ప్రచారం జరగడం RRR టైటిల్ గా రఘుపతి రాఘవ రాజారాం అనే సాఫ్ట్ టైటిల్ ప్రచారంలోకి రావడం జరిగింది. కొమరం బీమ్, అల్లూరి సీతారామరాజు లాంటి పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ల పాత్రలకు ఈ టైటిల్ సూట్ అవుతుందా? అసలు ఈ టైటిల్ ఇండియా వైడ్ గా ఎక్కుతుందా? అనేది ఇప్పుడు అందరిముంది ఉన్న అతి పెద్ద ప్రశ్న.

రామ్ చరణ్ - ఎన్టీఆర్ - రాజమౌళి సినిమా టైటిల్ రఘుపతి రాఘవ రాజారాం అంటూ సోషల్ మీడియా హడావిడి తప్ప ఇండియా వైడ్ గా ఆ టైటిల్ కి అంతగా క్రేజ్ కనిపించడం లేదు. అసలు ఆ టైటిల్ పెద్దగా ట్రేండింగ్ లోను లేదు. కాబట్టి ఇదే టైటిల్ ఫిక్స్ అంటూ వస్తున్న వార్తలకు రాజమౌళి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి. కాకపోతే ఇంత పవర్ ఫుల్ పాత్రల్తో తెరకెక్కుతున్న ఈసినిమాకి ఇలాంటి సాఫ్ట్ టైటిల్ ఎక్కడనేది చాలామంది అభిప్రాయం. కాకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ RRR కి సరిపడా రఘుపతి రాఘవ రాజారామ్ టైటిల్ కి మొగ్గుచూపారని, కానీ పాన్ ఇండియా లెవల్ కి ఆ టైటిల్ సరిపోదని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజమౌళి RRR టైటిల్ గా ఇది పెడతాడో అంటూ ఇప్పడూ అందరిలో పిచ్చ క్యూరియాసిటీ మొదలయ్యింది.