అదృశ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థి కేస్ రీఓపెన్ చేయించిన హోంమంత్రి

అదృశ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థి కేస్ రీఓపెన్  చేయించిన హోంమంత్రి అదృశ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థి కేస్ రీఓపెన్ చేయించిన హోంమంత్రి

అదృశ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థి కేస్ రీఓపెన్  చేయించిన హోంమంత్రి మహమ్మద్ అలీ 

మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన నెరేళ్ల కోమరయ్య లక్ష్మీ ల కుమారుడు నెరేళ్ల సీతారాంలు 2006 విద్య సంవత్సరంలో హైదరాబాద్ లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రామతపురంలోని jntu ప్రభుత్వపాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతూ అట్టి హాస్టల్ లో ఉండేవాడు 7ఫిబ్రవరి 2006 రోజు స్నేహితుని దగ్గరకు వెళ్లి వస్తానని హాస్టల్ నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు విద్యార్ధి నుండి నెలరోజులు గా ఎలాంటి పోను కాల్స్ రాకపోవటం తో విద్యార్ధి కుంటుబసభ్యులు ఆందోళనకుగురై హాస్టల్ కు వెళ్లి వాకబు చేయగా నెలరోజుల క్రితం సీతారాములు స్నేహితుని దగ్గరకు వెళ్లి వస్తానని వెళ్లి తిరిగి రాలేదు అని హాస్టల్ వార్డెన్  చెప్పినారు దీనితో ఆందోళకు గురైన కుంటుబసభ్యులు తెలిసినవారి దగ్గర బంధువుల దగ్గర వెతికినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఉప్పల్ పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు 229/2006నమోదు చేయటం జరిగింది కానీ ఇది మిస్సింగ్ కాదు కిడ్నాప్ అని తెలిసి సాక్ష్యాధారాలతో పోలీసులకు చూపిన పోలీసులు రాజకీయ ఒత్తిడితో కేసు మిస్టరీ సేధించలేక  మధ్యలోనే మూసివేసి  విద్యార్థి కుటుంబ సభ్యులను అనేక ఇబ్బందులకు గురిచేశారు యికేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రులకు , హోంమంత్రులకు పిర్యాదు చేసిన ఎలాంటి ఫలితంలేకుండా పోయింది అని కుటుంబ సభ్యులు ఆవేదన  చెందారు తెలంగాణ రాష్ట్రం రావటంతో మరోసారి తెలంగాణ హోం మంత్రి మొహమ్మద్ ఆలీ గారిని కలిసి అతనికి ఫిర్యాదు చేయటం జరిగింది అతడు వెంటనే స్పందించి కొట్టివేసిన ఈ కేసును  రీ ఓపెన్  చేయమని ఆదేశించారు ఉప్పల్ పోలీసులు విద్యార్థి స్వగ్రామం మెదక్ జిల్లా నిజాంపేటమండలం కల్వకుంట గ్రామానికి వెళ్లి నెరేళ్ల సీతారములు కు సంధించిన ఆధారాలు సేకరించి ఈ కేసును రీ ఓపెన్ చేసి విచారిస్తున్నారు ఈ కేసును రీ ఓపెన్ చేసినందుకు ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ,విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు  హోం మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు