పిల్లలకు పోలియో చుక్కల మందు వేసిన మంత్రి వేముల

పిల్లలకు పోలియో చుక్కల మందు వేసిన మంత్రి వేముల పిల్లలకు పోలియో చుక్కల మందు వేసిన మంత్రి వేముల

పిల్లలకు పోలియో చుక్కల మందు వేసిన మంత్రి వేముల

వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థితి గతులను పరిశీలించి...

అనంతరం హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి.

నిజామాబాద్ జిల్లా:

బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలకు పోలియో చుక్కల మందు కార్యక్రమాన్ని ప్రారంభించి, పలువురు చిన్నారులకు రాష్ట్ర రోడ్లు,భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పల్స్ పోలియో చుక్కల మందు వేశారు.ఈ సందర్భంగా మంత్రి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం అంతా కలియతిరుగుతూ ఆసుపత్రి స్థితిగతులను పరిశీలించారు.అనంతరం ఆరోగ్య కేంద్రం ఆవరణలో సిబ్బందితో కలసి ఆయన మొక్కలు నాటారు.

కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..

చిన్న పిల్లలకు అంగవైకల్యం రాకుండా పల్స్ పోలియో చుక్కల మందు అవసరం. 
భవిష్యత్ అంతా ఈ చిన్నారులదే కాబట్టి వారిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిది.పోలియో పూర్తిగా నివారించబడిందని డాక్టర్లు చెప్తున్నా..5 ఏండ్ల లోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలి.వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భారతి, ఎంపిపి జమున, సర్పంచ్ తీగల రాధ, స్థానిక నేతలతో పాటు ఆర్మూర్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్,వేల్పూర్ మెడికల్ ఆఫీసర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.