ముగ్గులతో కారుగుర్తు వేసి ప్రచారం చేయండి- మంత్రి పువ్వాడ

ముగ్గులతో కారుగుర్తు వేసి ప్రచారం చేయండి- మంత్రి పువ్వాడ ముగ్గులతో కారుగుర్తు వేసి ప్రచారం చేయండి- మంత్రి పువ్వాడ

 వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్న గులాబీ సైన్యం. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో టి ఆర్ యస్ పార్టీ పైసా ఖర్చు లేకుండా వినూత్నమైన ఎన్నికల ప్రచారానికి దిగింది.సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇండ్లముందు వేసే ముగ్గులలో కారు గుర్తుకే మనఓటు.... కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి ...కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ముగ్గుల రూపంలో జరుగుతున్న ప్రచారం పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.....   

 

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న మున్సిపాలిటీలో సంక్రాంతి పండుగ సందర్భంగా తెరాస కుటుంబ సభ్యులు ప్రతి రోజు తమ ఇంటి ముందు కారు గుర్తు వేసి, రంగులు అద్ది ప్రచారం అస్త్రంగా మలుచుని ఓట్లు అభ్యర్దించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్ బండ్ పై నిర్వహించిన ముగ్గుల పోటీలకు ఆదివారం హాజరైయ్యారు. రంగు రంగుల ముగ్గులను చూసి వేసిన వారిని అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస పార్టీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి  శ్రీ కేటిఆర్ గారి ఆదేశాల మేరకు తెరాస కుటుంబ సభ్యుల ఇంటి ముందు కారు గుర్తుతో కూడిన ముగ్గులు వేయాలని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెంలో తెరాస శ్రేణులు తమ తమ వార్డుల్లో ఉన్న తెరాస నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు, అభిమానులకు తగు సమాచారం ఇచ్చి కారు గుర్తులతో ముగ్గులను వేసే విధంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీనితో ప్రతిపక్షాలు కారు గుర్తుని చూసి బేజారు అవుతారని అన్నారు.

పార్టీ శ్రేణులు ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని  తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల చిత్రాలు, వాటి వల్ల జరిగిన లబ్ది, కొనసాగుతున్న అనేక పథకాలు తదితర అంశాలను కూడా ముగ్గుల రూపంలో ప్రజలకు వివరించాలన్నారు.