ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్ల పట్టాలు కేటాయించి, డబల్ బెడ

ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్ల పట్టాలు కేటాయించి, డబల్ బెడ ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్ల పట్టాలు కేటాయించి, డబల్ బెడ

ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన స్థలంలో ఇళ్ల పట్టాలు కేటాయించి, డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు ములకలపల్లి రాములు కోరారు. శుక్రవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామ దళితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి సుమారు 150 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన స్థలం బీసీలకు కేటాయించగా వారు ఎస్సీ కాలనీ పక్కన ఉండమని నిరాకరించడంతో సర్వేనెంబర్ 211, 214 లో సుమారు 2. 20 గుంటల స్థలం గత 30 సంవత్సరాల నుండి బీడు పడి ఉన్నదని ఈ భూమిని గ్రామంలోని పెద్దలు అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం గ్రామం లో సుమారు వంద కుటుంబాలు 100 కుటుంబాలు ఇండ్ల స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే వీరికి ఖాళీగా ఉన్న ఈ స్థలాన్ని కేటాయించి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు సోమ పంగ జానయ్య, బెల్లంకొండ వెంకటేశ్వర్లు ,జిల్లా కమిటీ సభ్యురాలు ఉయ్యాల పారిజాత, వాయిల సింగారం గ్రామస్తులు గూడెపురి పాపయ్య, కృష్ణ ,మేళ్లచెరువు జకరయ్య, ఆకారపు నరేందర్ ,గుడె పూరి వెంకన్న, వెంకన్న ,కలకొండ శేఖర్, మేళ్లచెరువు సైదులు ,అశోక్ తదితరులు పాల్గొన్నారు