బల్గేరియాలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ మొదలు

బల్గేరియాలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ మొదలు బల్గేరియాలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ మొదలు

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. తాజా షెడ్యూల్ ను 'బల్గేరియా'లో ప్లాన్ చేశారు. ఈ రోజునే అక్కడ తాజా షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఈ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఒక వైపున ఎన్టీఆర్ అభిమానులు .. మరో వైపున చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వివిధ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్న విషయం తెలిసిందే.